పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేట్.. జమ్మూలో నైట్ కర్ఫ్యూ

పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేట్.. జమ్మూలో నైట్ కర్ఫ్యూ

జమ్మూ నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూ రీజియన్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నామని జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బుధవారం నుంచి కర్ఫ్యూ రూల్స్ అమల్లోకి వస్తాయన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ హెచ్చరించారు. 

రీసెంట్‌గా జమ్మూలో కరోనా పాజిటివిటీ రేట్ 0.2 శాతం పెరిగిందని.. దీన్ని సమర్థంగా ఎదుర్కోవడంపై డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) రివ్యూ నిర్వహించిందని గార్గ్ అన్నారు. ప్రజలు కరోనా రూల్స్‌ తప్పకుండా పాటించాలని.. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాత్రి కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ టౌన్‌లోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహశీల్దార్లను గార్గ్ ఆదేశించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.  

మరిన్ని వార్తల కోసం: 

డాడీని జైలులో పెట్టండి.. పోలీసులను కోరిన చిన్నారి 

పారాసెయిలింగ్‌.. తాడు తెగి సముద్రంలో పడిన జంట

బస్సు కావాలని టీచర్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్