యూరియా షాప్ల లైసెన్స్ సస్పెన్షన్.. సిర్పూర్ టి. మండలం.. భూపాలపట్నంలో ఘటన

యూరియా షాప్ల లైసెన్స్ సస్పెన్షన్.. సిర్పూర్ టి. మండలం.. భూపాలపట్నంలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: ఈనెల 18న అర్ధరాత్రి యూరియా అమ్మిన మూడు ఫర్టిలైజర్ దుకాణాలపై అగ్రికల్చర్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. సిర్పూర్ టీ మండలం భూపాలపట్నంలో శ్రీనివాస ఫెర్టిలైజర్, కౌటాల మండలం శీర్ష గ్రామంలో కొండయ్య ట్రేడర్, శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ల ఫెర్టిలైజర్ లైసెన్స్​ను సస్పెండ్ చేస్తూ కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్ ఆదేశాలు ఇచ్చారు. 

నిబంధనలకు విరుద్ధంగా యూరియా పంపిణీ చేయడంతో చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ అధికారులు పర్యవేక్షణలోనే యూరియా పంపిణీ చేయాలన్నారు. అర్ధరాత్రి అధికారులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం రూల్స్​కు విరుద్ధమన్నారు. రూల్స్ పాటించకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.