
హైదరాబాద్, వెలుగు: లైఫ్108 ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటా కొనబోతున్నామని ఈ-–కామర్స్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ ప్రకటించింది. ఫలితంగా ఇది తన సబ్సిడరీగా మారుతుందని తెలిపింది. లైఫ్ 108 కంపెనీ 2021 డిసెంబరులో రూ.14 లక్షల ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌తో మొదలయింది. ఇది పలు హెల్త్‌కేర్, లైఫ్‌స్టైల్ ప్రొడక్టులను అందిస్తోంది. రిటైల్, హోల్‌సేల్, బీ2బీ, ఈ–కామర్స్ ద్వారా ప్రొడక్టులను అమ్ముతోంది. సొంత బ్రాండుతో హెల్త్‌కేర్ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. లైఫ్ 108 పేరుతో న్యూట్రిషన్ ప్రొడక్టులను తీసుకురానుంది.