హైదరాబాద్, వెలుగు: ఈ–కామర్స్ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరంలో అద్భుత పురోగతి సాధించింది. వ్యూహాత్మక మార్పుల వల్ల పాత నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టింది. కంపెనీ ఆదాయం (స్టాండెలోన్) 210.95 శాతం వృద్ధితో 15.02 కోట్ల రూపాయలకు చేరింది.
గ్రూప్ ఆదాయం (కన్సాలిడేటెడ్ ) 181 శాతం పెరిగి రూ.21.69 కోట్లకు చేరింది. గత ఏడాది రూ.3.64 కోట్ల నష్టం రాగా, ఈసారి 0.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ పద్ధతిలో నికర లాభం కూడా 0.69 కోట్లు వచ్చింది. కంపెనీ ఈపీఎస్ మెరుగుపడింది. బ్యాలెన్స్ షీట్ పరంగా నిహార్ ఇన్ఫో తన దీర్ఘకాలిక అప్పులను 46.66 శాతం తగ్గించుకుని రూ.0.19 కోట్లకు పరిమితం చేసింది.
