
మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు(CommitteeKurrollu). ఆగస్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్ల జాతరకు సినీ ఆడియన్స్ తో పాటుగా సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి వీకెండ్ను కంప్లీట్ చేసుకుంది.
ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రెండవ రోజు రూ.3.69 కోట్లను రాబట్టింది.ఇక ఈ సినిమాకు వచ్చే మౌత్ టాక్ రోజురోజు పెరుగుతుండటంతో కలెక్షన్స్ పెరుగుతూ వెళుతున్నాయి. దీంతో విడుదలైన మొదటి మూడు రోజుల్లో కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ దగ్గర రూ. 6.04 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆగస్ట్ 15వరకు ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను కలగిలిపిన మంచి కథను (‘కమిటీ కుర్రోళ్ళు’) తీసుకొచ్చిన నిహారికకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
Nostalgic Entertainer #CommitteeKurrollu is unstoppable at the box office ?
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 12, 2024
The collections are skyrocketing with each passing day!?
Day 3 >> Day 2 >> Day 1
Book Ticekts?
▶️ https://t.co/MsqA9nQyFY @IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev pic.twitter.com/wyMDBq6ElZ
ఈ రూరల్ కామెడీ డ్రామాలో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి కథలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు..అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది డైరెక్టర్ యదు వంశీ చాలా సహజ సిద్ధంగా చూపించారు. అలాగే ఈ సినిమాలో అంతర్లీనంగా రిజర్వేషన్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాలకు తావులేకుండా డైరెక్టర్ టచ్ చేయడం చాలా ఇంప్రెస్స్ గా ఉంది.