
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోబోతున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న వీరిద్దరూ.. విడాకులకు అప్లైయ్ కూడా చేశారని వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై ఇటు నిహారిక కానీ అటు చైతన్య కానీ స్పందించడం లేదు.
ఇన్ స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వారికి సంబంధించిన పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌కు కూడా నిహారిక సింగిల్‌గానే హాజరై హడావిడి చేయడంతో విడాకుల రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి.
హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. కానీ నిహారిక మాత్రం తన భర్తతో కాకుండా సింగిల్ గానే హాజరైంది. మరోవైపు ఇటీవలే చైతన్య కూడా.. నిహారిక లేకుండానే తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.