అలాంటి వెధవలు ప్రతీచోట ఉంటారు.. రెచ్చిపోయిన నిహారిక

అలాంటి వెధవలు ప్రతీచోట ఉంటారు.. రెచ్చిపోయిన నిహారిక

మెగా డాటర్ నిహారిక సోషల్‌ మీడియాలో రూమర్స్‌ క్రియేట్ చేసేవాళ్ళపై రెచ్చిపోయింది. అలాంటి వెదవలు టైం ఇవ్వకూడదు అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం నిహారిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఆమె స్క్రీన్ పై కనిపించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్. ఈ సిరీస్ మే 19 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ట్రోల్స్‌ చేసే వాళ్ల గురించి స్పందించింది నిహారిక..

పని పాట లేనివాళ్లే ట్రోల్స్‌ చేస్తారని, అలాంటి వారి గురించి తాను పట్టించుకోబోనని కామెంట్ చేసింది. "నిజానికి మనం అవసరం లేనివాళ్లకి అటెన్షన్‌ ఇస్తున్నాం. ఆలాంటి ఇడియట్స్ ప్రతి చోట ఉంటూనే ఉంటారు. వాళ్లను మనం పట్టించుకుంటే ఇంకా రెచ్చిపోతారు. అందుకే అలాంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? ఒకప్పుడు సోషల్‌ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్‌ను చూసేదాన్ని. కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. దాని వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పుకొచ్చింది నిహారిక.

ఇక గత కొంత కాలంగా నిహారిక విడాకులు తీసుకోనుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకే ఆమె ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.