
ఐటీ సర్వీసెస్ రంగంలోని ఎస్ఐఐటీ టెక్నాలజీస్ ను ఎన్‌ఐఐటీ, ఇతర ప్రమోటర్ల నుంచి బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ కొనుగోలు చేస్తోంది. ఎన్‌ఐఐటీ లిమిటెడ్ ,ఇతర ప్రమోటర్ల నుంచి 30 శాతం ఈక్విటీని రూ.2,627 కోట్లకు బేరింగ్ చెల్లిం చనుంది. ఈ డీల్‌తోఎన్ ఐఐటీ టెక్నాలజీస్‌లో పబ్లిక్ వాటాదారులకు బేరింగ్ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. మరో 26 శాతం వాటాలకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాలి. ఓపెన్ ఆఫర్‌తో కలిపితే డీల్ విలువ మొత్తం రూ. 4,890కోట్లకు చేరుతుంది.18.85 మిలియన్ షేర్ల కొనుగోలుకు బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీకి చెందిన కొన్ని ఫండ్స్‌తమతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్ ఐఐటీలిమిటెడ్ వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.1,394చెల్లిస్తా రు. ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ లో ఎన్ఐఐటీ లిమిటెడ్ కు 14.4 మిలియన్లు, ప్రమోటర్లు రాజేంద్రపవార్, సింగ్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులకు కలిపి మరో 4.3 మిలియన్ షేర్లు ఉన్నాయి. అంటేఎన్ ఐఐటీ లిమిటెడ్ కు 23 శాతం వాటా ఉంటే,ఇతర ప్రమోటర్లకు 7 శాతం వాటాలు ఉన్నా యి.పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం ద్వారామరో 26 శాతం వాటాలను బేరింగ్ కొనుగోలు చేసేవీలుంటుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా కొనే వాటాలతోకలిపితే ఎన్ ఐఐటీ టెక్నాలజీస్ లో బేరింగ్ వాటా56 శాతానికి చేరుతుంది. ఈ డీల్‌కు రెగ్ యులేటరీ ఏజన్సీల నుంచి అనుమతి లభించాల్సి ఉంటుందని ఎన్‌ఐఐటీ లిమిటెడ్ తెలిపింది. ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌నుం చి వేరుపడి 2004 లో ప్రత్యేక కంపెనీగా ఎన్ ఐఐటీ టెక్నాలజీస్ ఏర్పడింది. అప్పటి నుంచి ఐటీ సేవలరంగంలో చెప్పుకో దగ్గ వృద్ధి సాధించింది. దీర్ఘకాలికకస్టమర్లను చాలా మందినే ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ సంపాదించుకుం ది. ట్రావెల్, బ్యాంకిం గ్ ఇన్సూరెన్ స్‌వంటి రంగాలలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ కు కస్టమర్లు ఉన్నారని ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ చెప్పారు.