ఐబీఏను సొంతింటిలా భావిస్తా : నిఖత్​ జరీన్

ఐబీఏను సొంతింటిలా భావిస్తా : నిఖత్​ జరీన్

దుబాయ్​ : ఇంటర్నేషనల్‌‌‌‌ బాక్సింగ్‌‌ అసోసియేషన్‌‌ (ఐబీఏ)ను సొంతింటిలా భావిస్తానని వరల్డ్‌‌ చాంపియన్‌‌, హైదరాబాదీ నిఖత్‌‌ జరీన్‌‌ చెప్పింది. వచ్చే వరల్డ్‌‌ మెన్స్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ను ఉజ్బెకిస్తాన్‌‌లోని తాష్కెంట్‌‌కు కేటాయించినట్టు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఐబీఏ ప్రెసిడెంట్‌‌ ఉమర్‌‌ క్రెమ్లెవ్‌‌ ప్రకటించారు.

ఈ టోర్నీకి రికార్డు స్థాయిలో రూ. 42.57 కోట్ల ప్రైజ్‌‌మనీ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే చాన్స్​ దక్కించుకున్న నిఖత్​ మాట్లాడుతూ.. ‘ఐబీఏ నా హోమ్‌‌. నేనిక్కడ సేఫ్‌‌గా ఫీల్‌‌ అవుతా. ఈ విక్టరీకి (వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌) నేను అందుకున్న  ప్రైజ్‌‌మనీకి ఐబీఏకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ మొత్తంతో నేను హైదరాబాద్‌‌లో ఇల్లు కొంటాను’ అని చెప్పుకొచ్చింది.