స్ట్రాంజా బాక్సింగ్ బరిలో నిఖత్

స్ట్రాంజా బాక్సింగ్ బరిలో నిఖత్

న్యూఢిల్లీ: డబుల్ వరల్డ్ చాంపియన్‌‌‌‌, ఇండియా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లల్లీనా బొర్గోహైన్ గురువారం నుంచి బల్గేరియాలోని సోఫియాలో జరిగే స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌‌‌‌లో బరిలోకి దిగనున్నారు. ఇండియా నుంచి మొత్తం 19 మంది పోటీ పడనున్నారు.

2019, 2022లో గోల్డ్ మెడల్స్ నెగ్గిన  నిఖత్ విమెన్స్‌‌‌‌ టీమ్‌ను నడిపించనుంది. మెన్స్‌‌‌‌ను అమిత్  లీడ్ చేయనున్నాడు. ఒలింపిక్ క్వాలిఫయర్స్‌‌‌‌లో బరిలోకి దిగే బాక్సర్లు ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నారు. కాగా, నిఖత్, ప్రీతి, లవ్లీనా ఇప్పటికే ఒలింపిక్‌‌‌‌ బెర్తులు సాధించారు. 

మెన్స్ టీమ్: బరున్ సింగ్ (48 కేజీ), అమిత్ (51 కేజీ), సచిన్ (57 కేజీ), ఆకాశ్  గోర్ఖా(60 కేజీ), వంశజ్ (63.50 కేజీ), రజత్ (67 కేజీ), ఆకాశ్ (71 కేజీ), దీపక్ (75 కేజీ), అభిమన్యు లౌరా (80 కేజీ), జుగ్నూ (86 కేజీ), నవీన్ కుమార్ (92 కేజీ), (సాగర్ 92+ కేజీ).

విమెన్స్ టీమ్: నిఖత్ జరీన్ (50 కేజీ), ప్రీతి (54 కేజీ), సాక్షి (57 కేజీ), మనీషా (60 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ),  లవ్లీనా (75 కేజీ).