
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఆదివారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘మొదటి సారిగా చూపు తగిలే.. గుండెల్లో మోగిందే నీ తొలి కబురే.. మనసు వింతగా మాట వినదే.. గల్లంతై పోయిందే ఊహలు మొదలే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ మెప్పిస్తోంది.
నిఖిల్, ఐశ్వర్య మీనన్ లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ చేయగా.. ‘జూమ్ జూమ్ రే.. నీ కోసం నే తయ్యారే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడు జన్మలు’ అంటూ క్యాచీ లిరిక్స్ రాశాడు కిట్టు విస్సా ప్రగడ. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడిన తీరు ఆకట్టుకుంది. సన్యా ఠాకూర్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో ఆర్యన్ రాజేష్ రీఎంట్రీ ఇస్తున్నాడు. అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూన్ 29న సినిమా విడుదల కానుంది.