ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్ ‘హీ-మ్యాన్’ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ పేరుతో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాకు వాయిస్ ఇచ్చాడు.
టైటిల్ రోల్ అయిన ‘హీ-మ్యాన్’ పాత్రకు తెలుగులో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. ఈ ఐకానిక్ క్యారెక్టర్‌కు నిఖిల్ డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అలాగే విలన్ స్కెలెటర్ పాత్రకు విలన్ ఆర్టిస్ట్ ఆదిత్య మీనన్ వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం.
నికోలస్ గలిట్జైన్.. ప్రిన్స్ ఆడమ్ / హీ-మ్యాన్‌గా నటించాడు. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మించింది. జూన్ 5న ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
