నిలోఫర్ నర్సుకు కరోనావైరస్

నిలోఫర్ నర్సుకు కరోనావైరస్

కరోనావైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. దాని బారినపడిన వారికి సేవచేస్తున్న డాక్టర్లను సైతం పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి నర్సులను సైతం తాకింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్ పల్లిలో తొలి కరోనా కేసు నమోదయింది. శంకర్ పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మహిళ నిలోఫర్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది. నిలోఫర్ హాస్పిటల్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో అక్కడ పనిచేస్తున్న వారందరికీ టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దాంతో సోమవారం మధ్యాహ్నం ఆ నర్సు కరోనా టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చి ప్రొద్దుటూరుకు వచ్చింది. అదే రోజు రాత్రి వైద్యులు ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. వెంటనే నర్సును సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానిక అధికారులు గ్రామాన్ని మొత్తం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయించారు. నర్సుకు కరోనా సోకడంతో.. అధికారులు ఆమె ఇంట్లో వారందరినీ క్వారంటైన్ లో ఉంచారు. అంతేకాకుండా ఆమె మరియు ఆమె కుటుంబసభ్యలు గ్రామంలో ఎవరెవరిని కలిశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

For More News..

కాసేపట్లో పెళ్లిమండపానికి చేరిక.. అంతలోనే వరుడి కారులో మంటలు..

దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం