మాల్దీవుల అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి

మాల్దీవుల అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి

అందులో 9 మంది ఇండియన్లు 

మాలే: మాల్దీవులలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఇండియన్లు సహా 10 మంది చనిపోయారు. మాల్దీవుల రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్​లో వలస కార్మికులు ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్​లో కార్మికులు ఉంటుండగా, గ్రౌండ్ ఫ్లోర్​లో గ్యారేజీ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు గ్యారేజీలో మంటలు అంటుకున్నాయి. అవి ఫస్ట్ ఫ్లోర్​కు వ్యాపించాయి. 

ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం ఉదయం వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 10 డెడ్ బాడీలను వెలికితీశామని అధికారులు చెప్పారు. చనిపోయినోళ్లలో 9 మంది ఇండియన్లు, ఒకరు బంగ్లాదేశీ అని తెలిపారు. ఇంకొంత మందికి గాయాలయ్యాయన్నారు. కాగా, ఈ ఘటనపై మాల్దీవులలోని ఇండియన్ హైకమిషన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.