కారేపల్లి, వెలుగు: కుక్కల దాడిలో తొమ్మిది గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటన కారేపల్లి మండల కేంద్రంలోని బొడ్రాయి బజారులో మంగళవారం జరిగింది. బాధితుతుడు తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్రాయి బజరుకు చెందిన జంగా మధు తన గొర్రెల మంద కోసం ఇంటి సమీపంలోనే ప్రత్యేక దొడ్డి ఏర్పాటు చేశాడు.
మంగళవారం తెల్లవారుజామున ఏడు కుక్కలు ఒకేసారి గొర్రెల మందపై దాడి చేసి తొమ్మిది గొర్రెలను చంపాయి. మరో 12 గొర్రెలను తీవ్రంగా గాయపర్చాయి. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వం దుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.