
2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషి అక్షయ్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన డెత్ వారెంట్ ను రద్దుచేసి.. యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ అక్షయ్ సింగ్ తరఫున లాయర్ ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ N.V.రమణ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల బెంచ్.. క్యురేటివ్ పిటిషన్ ను పరిశీలించింది. పిటిషన్ కు మెరిట్ లేదని కొట్టేసింది.
ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని ఈ నెల 17 న సుప్రీంకోర్టు కొత్త డెత్ వారెంట్ ను ఇష్యూ చేసింది. అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినా… వినయ్ శర్మ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినా… ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల తర్వాతే ఉరి తీయాల్సి ఉంటుంది. ఇంకో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ వేయలేదు. న్యాయ ప్రక్రియ మిగిలి ఉండడంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడడం ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు.