NIRF Ranking 2024: అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్..వర్సిటీల్లో ఓయూకి 6వ స్థానం

NIRF Ranking 2024: అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్..వర్సిటీల్లో  ఓయూకి  6వ స్థానం

ఢిల్లీ: దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్స్టి ట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎస్ఐఆర్ఎఫ్ ) కింద విడుదల చేసిన జాబితాలో మద్రాస్ ఐఐటీ వరుసగా ఆరో సారి టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం. ఓవరాల్ టాప్ 10 జాబితాలో ఎనిమిది ఐఐటీలు, ఢిల్లీ ఎయిమ్స్, జేఎన్ూకు చోటు లభించింది. విద్యాసంస్థల పరంగా చూస్తే మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్ ఉండగా రెండో స్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు ఉంది.

టాప్ 10 ఇంజనీరింగ్ విద్యాసంస్థలు

1.ఐఐటీ మద్రాస్
2. ఐఐటీ ఢిల్లీ 
3. ఐఐటీ బాంబే
 4. ఐఐటీ కాన్పూర్ 
5. ఐఐటీ ఖరగ్ పూర్
6. ఐఐటీ రూర్కీ 
7. ఐఐటీ గువహటి 
8.ఐఐటీ హైదరాబాద్ 
9. ఎన్ ఐటీ తిరుచ్చిరాపల్లి 
10. ఐఐటీ, బీహెచ్ యు, వారణాసి

యూనివర్సిటీల్లో..

1. అన్నాయూనివర్సిటీ, చెన్నయ్
 2. జాదవ్ పూర్ యూనివర్సిటీ కోల్ కతా 
3. సావిత్రిబాయి ఫూలే వర్సిటీ, పుణె 
4. కల్ కత్తా యూనివర్సిటీ, కోల్ కతా
 5.పంజాబ్ యూనివ్సీటీ, చండీగఢ్
6. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ 
7. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ పట్టణం 
8.భారతీయార్ యూనివర్సిటీ, కోయంబత్తూర్
 9. కేరళ యూనివర్సిటీ, తిరువనంతపురం 
10. కొచ్చిన్ యూనివర్సిటీ,ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొచ్చిన్