
నిర్మల్, వెలుగు: రావి చెట్టు మీదికి పాము పదే పదే వస్తుందంట. కానీ దాన్ని చంపొద్దు.. అట్లని వస్తుంటే ఊరుకోకూడదు. ఏం చేయాలి! సింపుల్.. పాము మంత్రం వేస్తే సరిపోతదని అనుకున్నారు. పాము కరిచినవాళ్లకు మంత్రం వేయడం ఊర్లల్లో చూస్తుంటాం. ఎవరినీ పాము కరవకుంటే మంత్రం ఎవరికి వేయాలి? చెట్టుకే వేస్తే సరిపోద్ది. అట్లే వేశారు కూడా. అదే ఇసుక మంత్రం. నిర్మల్ కలెక్టర్ ఆఫీస్‌లో మంగళవారం ఇదే తతంగం జరిగింది. ఆఫీస్‌లోని రావి చెట్టు మీదకు పదేపదే పాము వస్తున్నట్లు కొందమంది చూశారట. దాన్ని చంపకుండా, రాకుండా చేయాలనుకున్నారు.ఇంకేముంది ఆఫీస్ లోని ఓ ఉద్యోగి దీనికి ఇసుక మంత్రమే కరెక్టని మంత్రాలు చదువుతూ ఇసుకను చెట్టు చుట్టూ చల్లించాడు. ఆఫీసంతా ఇసుక ట్రీట్ మెంట్ చేశాడు. ఈ ఎపిసోడ్‌ను టీవీ సీరియల్ చూసినట్టు చాలా క్యూరియాసిటీతో చూశారు.