
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద గురువారం యూరియా కోసం రైతులు ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చెప్పులు లైన్లో పెట్టి ఎదురుచూశారు. పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, యూరియా అందకపోతే పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం మూడు రోజులుగా పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదని, సరిపడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.