రగ్బీ జోనల్ స్థాయి పోటీలకు నిర్మల్ జట్టు ఎంపిక

రగ్బీ జోనల్ స్థాయి పోటీలకు నిర్మల్ జట్టు ఎంపిక

నిర్మల్, వెలుగు: రగ్బీ జోనల్ స్థాయి పోటీలకు నిర్మల్ జిల్లా జట్టు ఎంపికైంది. పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో అండర్–14 బుధవారం రగ్బీ జోనల్ స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నిర్మల్​జిల్లా జట్టు విజయం సాధించింది.

జోనల్ స్థాయిలో ఎంపికైన జట్లు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. డీవైఎస్ ఓ నఫీఖాన్, ఎస్ జీఎఫ్ సెక్రటరీ రమణారావు, ఫిజికల్ డైరెక్టర్ భూమన్న పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. పీఈటీలు అన్నపూర్ణ, రామారావు, జమున, సంజు, వంశీ, శ్వేత తదితరులు పాల్గొన్నారు.