- జిల్లాలో ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ
నిర్మల్, వెలుగు: జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నిర్మల్ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజా వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు.
ఎస్పీ ఆదేశాలతో పోలీసులు నిర్మల్ పట్టణంలోని కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజా నిల్వలపై తనిఖీ చేశారు. దుకాణాల్లో చైనా మాంజా విక్రయం చట్టపరంగా నిషేధిమని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా అమ్మకం, కొనుగోలు, ఉపయోగం వంటివి ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పతంగుల కోసంసురక్షిత మాంజానే ఉపయోగించాలన్నారు.
