నిర్మల్ లో చోరీకి గురైన 71 సెల్ ఫోన్ల అప్పగింత : ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్ లో చోరీకి గురైన  71 సెల్ ఫోన్ల అప్పగింత : ఎస్పీ జానకీ షర్మిల
  • సీఈఐఆర్ పోర్టల్​తో రికవరీ: ఎస్పీ

నిర్మల్, వెలుగు: సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 71 మంది బాధితులకు వాటిని అప్పగించినట్లు నిర్మల్​ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఎస్పీ ఆఫీస్​లో బాధితులకు సెల్ ఫోన్లను అందించి మాట్లాడారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దన్నారు. 

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వాటిని రికవరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.16 కోట్ల విలువైన 1,806 ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పజెప్పామన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.