బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తెస్తం : ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్

బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తెస్తం : ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్

ఎన్నోఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. నామినీ చట్టాల్లో మార్పులు తెస్తామని శనివారం ప్రకటించారు. కొత్త చట్టాలతో బ్యాంకింగ్ వ్యవస్థ కస్టమర్ ఫ్రెండ్లీగా మారుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన  రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ కు ఆర్బీఐ గవర్నన్ శక్తికాంత్ దాస్ కూడా హాజరైయ్యారు. అన్ క్లైమ్ చేయని డిపాజిట్లపై దృష్టి పెట్టామన్నారు. ఇక ఇప్పుడు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.