
ముంబై: రూ. 2 వేల నోట్ల విత్‌డ్రాపై కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. దేశ పరువు తీసేలా మాట్లాడడం మాజీ ఆర్థిక మంత్రికి సరికాదని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె వివిధ రాష్ట్రాల్లో ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నారు. రూ. 2 వేల నోట్లను ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత విత్‌డ్రా చేయడం వలన దేశ కరెన్సీ స్టెబిలిటీ, ఇంటెగ్రిటీ దెబ్బ తింటుందని చిదంబరం కామెంట్ చేశారు.
కీలక ఇండికేటర్లన్నీ నెగెటివ్‌లో ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి హై గ్రోత్‌కు చేరుకోవడం కష్టమని అన్నారు. ఈ కామెంట్స్ గురించి సీతారామన్ దగ్గర ప్రస్తావించగా, కరెన్సీ, ఆర్‌బీఐ నిర్ణయాలపై ఇలా మాట్లాడడం మాజీ ఆర్థిక మంత్రికి సరితూగదని ఆమె అన్నారు. యూపీఐ గవర్నమెంట్ పదేళ్లు పాలించినప్పుడు పార్లమెంట్‌లో చాలా ప్రశ్నలు లేవనెత్తామని, కానీ, వీటికి వారు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.