పెట్టుబడులకు మస్తు అవకాశాలు

పెట్టుబడులకు మస్తు అవకాశాలు


న్యూఢిల్లీ: కరోనాతో దెబ్బతిన్న మన ఎకానమీ వేగంగా రికవరి అవుతోంది కాబట్టి మనదేశం ‘అత్యంత వేంగా ఎదుగుతున్న ఎకానమీల్లో  ఒకటిగా’ రికార్డులకు ఎక్కుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అవకాశాలను కంపెనీలు వదులుకోవద్దని, భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఫిక్కీ ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘మన వందో స్వాతంత్ర్య దినోత్సవం రాకముందే ఇండియాను అద్భుత ప్రగతి సాధించిన దేశంగా తీర్చిదిద్దాలి.  ఈసారి మేం పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌లు వాస్తవికంగా ఉన్నాయి. సన్‌‌‌‌రైజ్, న్యూఏజ్ సెక్టార్లలో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్‌‌‌‌లో ప్రకటించిన రాయితీలను ఉపయోగించుకోండి. బడ్జెట్‌‌‌‌లో క్యాపెక్స్‌‌‌‌కు ఎక్కువ నిధులు ఇచ్చాం. దీంతో  గ్రోత్ మరింత పెరుగుతుంది. పెట్టుబడులకు ఇదే  మంచి సమయం. న్యూక్లియర్ ఫ్యూయల్, స్సేస్, బల్క్‌‌‌‌డ్రగ్స్, వ్యాక్సిన్‌‌‌‌లు, జీనోమ్‌‌‌‌లలో చాలా అవకాశాలు ఉన్నాయి” అని ఆమె వివరించారు. వడ్డీరేట్లు, సరుకుల ధరలు పెరగడాన్ని గమనిస్తున్నామని నిర్మల అన్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రైవేటీకరణ విషయంలో వెనుకడుగు వేయబోమని ఆమె స్పష్టం చేశారు.