పెరుగుతున్న క్రూడ్​ రేట్లు మనకు ఛాలెంజే

పెరుగుతున్న క్రూడ్​ రేట్లు మనకు ఛాలెంజే

ముంబై: క్రూడాయిల్​ బారెల్​ రేటు 100 డాలర్లు చేరడాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉందని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ మంగళవారం వెల్లడించారు. రష్యా-–ఉక్రెయిన్​ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్​ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దేశ చమురు అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటుండటంతో, రేటు పెరుగుదల మనకి ఛాలెంజేనని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు . క్రూడ్ రేటు పెరిగితే మన ఖర్చు ఎక్కువవడమే కాకుండా,  దేశంలో  ఇన్​ఫ్లేషన్​ కూడా పెరిగి ఇబ్బందులెదురయ్యే ఛాన్స్​ ఉండటంతో, క్రూడ్​ రేటు పెరుగుదలను జాగ్రత్తగానే మానిటర్​ చేస్తున్నామని అన్నారు. ఫైనాన్షియల్​ స్టెబిలిటీపై దీని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మంగళవారం నాటి ఫైనాన్షియల్​ స్టెబిలిటీ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(ఎప్​ఎస్​డీసీ) మీటింగ్​లో ఈ అంశంపై చర్చించినట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. మంగళవారం బ్రెంట్​ క్రూడ్​ 96 డాలర్లను తాకడంపై డిస్కస్​ చేశామన్నారు. రిటెయిల్​రేట్ల విషయంలో ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయని నిర్మలా సీతారామన్​ చెప్పారు. రష్యా–ఉక్రెయిన్​ క్రైసిస్​ వల్ల ట్రేడ్​కు ఆటంకాలు లేవని, మన ఎగుమతిదారులు ఇబ్బంది పడకుండా చూస్తున్నామని మంత్రి నిర్మల పేర్కొన్నారు. 

ఎల్​ఐసీ ఐపీఓ....

సెబీ వద్ద పేపర్లు ఫైల్​ చేసిన తర్వాత ఎల్​ఐసీ ఐపీఓపై మార్కెట్లో ఆసక్తి పెరిగిందని చెబుతూ, ఐపీఓను పూర్తి చేయాలనే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. మార్చి నెలలో జరిగే ఐపీఓ ద్వారా రూ. 60 వేల కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ డిజిన్వెస్ట్​మెంట్​ టార్గెట్​. ఇది ప్లాన్​ప్రకారమే జరుగుతుందని ఫైనాన్స్​ మినిస్టర్​ పేర్కొన్నారు.నేషనల్​ స్టాక్​ ఎక్స్చేంజ్​(ఎన్​ఎస్​ఈ)లో కార్పొరేట్​ గవర్నెన్స్​ ఫెయిలైందనే ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు కూడా నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఎన్​ఎస్​ఈ విషయంలో సెబీ సరయిన చర్యలు తీసుకుందా, లేదా అనే అంశాన్నీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. కోలొకేషన్​ సర్వర్​ ఆరోపణలు బయటకు రావడంతో ఎన్​ఎస్​ఈ ఐపీఓను పోస్ట్​పోన్​ చేసుకోమని సెబీ చెప్పింది. 1994లో మొదలయిన ఎన్​ఎస్​ఈ ఇప్పుడు గ్లోబల్​గా డెరివేటివ్స్​ మార్కెట్లో నెంబర్​1 లెవెల్​కు ఎదిగింది. ఎన్​ఎస్​ఈ మాజీ ఎండీ చిత్రా రామక్రిష్ణ, ఆమెకు సలహాదారుగా వ్యవహరించిన ఆనంద్​ సుబ్రమణియన్​లను దేశం వదిలి వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.