క్రిప్టో రెగ్యులేషన్​కు ....అన్ని దేశాలను ఒక తాటిపైకి తెండి

క్రిప్టో రెగ్యులేషన్​కు ....అన్ని దేశాలను ఒక తాటిపైకి తెండి

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్​కు అన్ని దేశాలను ఒక తాటిపైకి తేవాల్సిందిగా ఐఎంఎఫ్​ ఎండీ క్రిస్టలినా జార్జివాను ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ రిక్వెస్ట్​ చేశారు. ఈ నెలలో బెంగళూరులో జరగబోయే  జీ20 ఫైనాన్స్​ మినిస్టర్లు, సెంట్రల్ బ్యాంక్​ గవర్నర్ల మీటింగ్​పై ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) ఎండీతో వర్చువల్​గా ఫైనాన్స్​ మినిస్టర్​ డిస్కషన్​ చేశారు. జీ20 ప్రెసిడెన్సీపై ఇండియాకు సపోర్టు చేస్తున్నందుకు ఐఎంఎఫ్​కు ఈ సందర్భంగా థ్యాంక్స్​ చెప్పారు. 

ఇండియా సాధిస్తున్న ఎకనమిక్​ ప్రోగ్రెస్ కు క్రిస్టలినా అభినందనలు తెలియచేసినట్లు నిర్మలా సీతారామన్​ ట్వీట్​ చేశారు. గ్లోబల్​గా సవాళ్లు ఎదురవుతున్న టైములో ఇండియా గ్రోత్​సాధించడం, డిజిటలైజేషన్– డిజిటల్​ పేమెంట్స్​పై చొరవ తీసుకోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు నిర్మలా సీతారామన్​ ఈ ట్వీట్స్​లో వెల్లడించారు. అప్పులకు సంబంధించిన చర్చలే జీ20 ఫైనాన్స్​ ట్రాక్​లో ప్రధానంగా ఉండబోతున్నాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్​ ఐఎంఎఫ్​ ఎండీకి తెలిపారు. దీంతోపాటు 16వ జనరల్​ రివ్యూ కోటా, గ్లోబల్​ ఫైనాన్షియల్​ సేఫ్టీ నెట్​ అంశాలపై చర్చ జరగనున్నట్లు వివరించారు.