
హైదరాబాద్, వెలుగు: పెర్‌ఫ్యూమ్స్ అమ్మే నిసారా సికింద్రాబాద్‌లో తన కొత్త స్టోర్‌ను ఓపెన్ చేసింది. ఈ స్టోర్ హైదరాబాద్‌లోని తిరుమల్‌గిరి మెయిన్ రోడ్‌లో, 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
నిసారాకు చెందిన పూర్తి కలెక్షన్ పెర్‌ప్యూమ్‌లను ఇక్కడ అమ్ముతారు. నాణ్యత, సరసమైన ధర, క్రాఫ్ట్‌మాన్‌షిప్‌పై దృష్టి పెట్టామని కంపెనీ చెబుతోంది. ప్రతి కొత్త స్టోర్‌తో లగ్జరీ పెర్‌ఫ్యూమ్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నిసారా సీఈఓ తరవిందర్ పాల్ అన్నారు.