
30 శాతం తగ్గించాలని టార్గెట్
న్యూఢిల్లీ : అన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పెట్రోల్– ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లను 2026 నాటికి తగ్గించాలనే ఫోకస్‌తో ప్రయత్నాలు జరుపుతున్నట్లు నిస్సాన్ మోటార్ కంపెనీ లిమిటెడ్ గురువారం వెల్లడించింది. ముఖ్యంగా పవర్ట్రెయిన్స్తయారీ అప్రోచ్‌ను మార్చుకోనున్నట్లు తెలిపింది. అన్ని మోడల్స్‌లోనూ ఒకే తరహా కాంపోనెంట్స్ వాడేలా చొరవ తీసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. 2019 తో పోలిస్తే ప్రొడక్షన్ ఖర్చును 30 శాతం తగ్గించాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు నిస్సాన్ తెలిపింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీలు వాడటంతో పాటు, తక్కువ ఖర్చయ్యే మెటీరియల్స్‌తో దొరికేవి వినియోగించనున్నట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తొషిహిరో హిరాయి మీడియాకు చెప్పారు. ఖరీదైన మెటల్స్ కాకుండా ఇతర మెటీరియల్స్ వాడి ఖర్చు తగ్గించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్స్ వంటి వాటి ఖర్చు కిందకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. పవర్‌ట్రెయిన్ సైజు, వెయిట్ తగ్గడం వల్ల వెహికల్ పెర్ఫార్మెన్స్ మెరుగవుతుందని, మంచు–ఇసుక ఉన్న ప్రాంతాలలోనూ డ్రైవింగ్ స్థిరంగా చేయడం వీలవుతుందని నిస్సాన్ పేర్కొంది. మాస్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ తెచ్చిన మొదటి కొద్ది కంపెనీలలో నిస్సాన్ కూడా ఒకటి. పదేళ్ల కిందట ఈ కంపెనీ తన లీఫ్ మోడల్ ను తెచ్చింది. 2030 నాటికి మొత్తం 27 ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇందులో 19 పూర్తి ఎలక్ట్రికల్ మోడల్స్ మార్కెట్లోకి తేవాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది.