ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తాదంట.. ఆకట్టుకుంటోన్న కుమారి శ్రీమతి టీజర్

ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తాదంట.. ఆకట్టుకుంటోన్న కుమారి శ్రీమతి టీజర్

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్(Nithya Menen). వచ్చినవి కాకుండా నచ్చిన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం నిత్య కొత్త కథతో త్వరలోనే  ఓటీటీ ద్వారా  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి(Kumari Srimathi).

లేటెస్ట్గా మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్లో మొత్తం7 ఎపిసోడ్స్ ఉండగా..టీజర్ ఆకట్టుకుంటోంది. సిరి అనే క్యారెక్టర్లో నిత్యా మీనన్ నటిస్తుండగా సీనియర్ గౌతమి మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్లో నిత్యామీనన్ పెళ్లి వయస్సు వచ్చిన కానీ, చేసుకోకుండా బిజినెస్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేసే క్యారెక్టర్ ఇంటెన్స్గా ఉంది. అలాగే 'అబ్దుల్ కలాం అంట.. రజినీకాంత్ అంట..తర్వాత ఈవిడే నంట.. ఉద్యోగం సద్యోగం చేయదంట..బిజినెస్సే చేస్తాదంట..కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోదట అంటూ రీసెంట్ గా నిత్యా మీనన్ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ మరింత  ఆసక్తి గా ఉండటంతో..ఈ వెబ్ సిరీస్‌‌పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంది. 

ఈ వెబ్ సిరీస్‌కి యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల స్టోరీని అందించగా, గోమటేష్ ఉపాధ్యాయు డైరెక్ట్ చేస్తున్నారు. కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్,స్వప్న సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ALSO READ : మహిళా రిజర్వేషన్లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల (సెప్టెంబర్ 28న) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.  ప్రస్తుతం  నిత్యా మీనన్ ధనుష్​ 50వ సినిమాతో పాటు ఓ మలయాళ  చిత్రంలోనూ నటిస్తోంది.