లెక్కలు పక్కాగా మార్చేద్దాం: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్

లెక్కలు పక్కాగా మార్చేద్దాం: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
  • రియల్‌ టైమ్ డేటా వాడకం
  • వరల్డ్ బ్యాంక్‌‌తో కలిసి ఆధునీకరణ
  • వైవీ రెడ్డి సూచనలు తీసుకుంటామన్న కుమార్.

న్యూఢిల్లీ : ఇండియన్ గణాంకాల వ్యవస్థలో సమూల మార్పు లు జరుగబోతున్నాయి. పాలసీ అనాలసిస్ కోసం రియల్ టైమ్ డేటాను వాడుకునేలా కేంద్ర గణాంకాల వ్యవస్థను మార్చాల్సినవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పా రు. దేశీయ గణాంకాల వ్యవస్థను ఆధునీకరించడం కోసం  నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంక్‌‌తో కలిసి పనిచేస్తున్నట్టు కుమార్ తెలిపారు.

న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో… ఒక్క విషయం అయితే నేను స్పష్టంగా చె ప్పదలుచుకున్నా. మన గణాంకాల వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. దీనిని ఆధునీకరించి, ప్రపంచంలో ఉన్న గణాంకాల వ్యవస్థకు తగ్గట్టు మన ఇండియన్ గణాంకాల వ్యవస్థను రూపొందించాలి అని పేర్కొ న్నారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ టీమ్ కూడా ఇక్కడకు వచ్చింది. ఇండియన్ గణాంకాల వ్యవస్థను ఆధునీకరించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం  అనే విషయాలపై వారు కూడా సమీక్షిస్తున్నారని కుమార్ చెప్పా రు. ఇటీవలే పలువురు నిపుణులు సమీక్షించిన మన ఆర్థికవృద్ధి డేటాపై పలు అభ్యం తరాలు వ్యక్తం చేసినసంగతి తెలిసిందే. ఇలా అనుమానాలు వ్యక్తం చేసిన వారి లో ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్‌‌‌‌ అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఉన్నారు. కేంద్ర గణాంకాల ఆఫీస్(CSO), నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్‌ (NSSO)ను నేషనల్ స్టా టిస్టి కల్ ఆఫీస్(NSO)లో విలీనం చేయాలని స్టాటిస్టి క్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లి మెంటేషన్ నిర్ణయించిన సమయంలో కుమార్ ఈ కామెంట్స్ చేశారు. సీ ఎస్‌ ఓ, ఎన్‌ ఎ-స్‌ ఎస్‌ ఓను ఎన్‌ ఎస్‌ ఓల విలీనం చేయడం మెయిన్ మినిస్ట్రీలో భాగమని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో అధికారిక గణాంకాల వ్యవస్థను బలోపేతం చేయనున్నామని చెప్పింది.

డిస్‌‌ఇన్వె స్ట్‌‌మెంట్ టార్గెట్ రూ.90 వేల కోట్లు….

అచేతన వ్యవస్థలో ఉన్న పలు పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ప్రైవేటైజ్ చేసే అంశంపై కూడా కుమార్ స్పందించారు. ‘ఈ  ఆర్థిక సంవత్సరంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూలను  పెంచుకునే విషయంలో చాలా సీరియస్‌ గా ఉన్నాం. దీనిలోనే డిస్‌ ఇన్వెస్ట్‌‌మెంట్ కూడా ఉంది. ప్రభుత్వ రంగ కంపెనీల డిస్‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించమని నీతి ఆయోగ్‌‌ను కేంద్రం ఆదేశించింది. 34 సిక్ పీఎస్‌ యూలు, నేషనల్ క్యారియర్‌‌‌‌ ఎయిరిండియాలో డిస్‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ గురించి ఇప్పటికే నీతి ఆయోగ్ పలు ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్‌ ఇన్వెస్ట్‌‌మెంట్ టార్గెట్ రూ.90 వేల కోట్లు గా ప్రభుత్వం నిర్ణయించింది’ అని కుమార్ చెప్పా రు. పేద ప్రజలకు కూడా ప్రయోజనాలు అందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరిసారి అధికారంలో తీసుకొచ్చి న పాలనాపరమైన సంస్కరణలను ఆయన గుర్తు చేసుకున్నారు. మరోవైపు నీతి ఆయోగ్‌‌పై ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డీ పలు కామెంట్ లు చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లపై  కూడా కుమార్ స్పందించారు. ఆయన అభిప్రాయాలను మరింత స్పష్టం గా తెలుసుకోవడం కోసం సెం ట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్‌‌‌‌ డాక్టర్ వైవీ రెడ్డిని తాను కలుస్తానని కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ ను ఎలా మెరుగుపరచాలనే విషయాలపై  వైవీ రెడ్డి సూచనలు తీసుకోనున్నామని కుమార్ తెలిపారు.

రైతుల ఆదాయం రెండింతలు పెం పు..

2022 నాటి కి రైతుల ఆదాయాలను రెండింతలు చేయాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకు-న్నట్టు కుమార్ చెప్పా రు. రైతుల ఆదాయాలను రెండింతలు చేయడం ఉత్పత్తి పెంచడంపై మాత్రమే ఆధారపడదని స్పష్టం చేశా రు. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఖర్చును తగ్గించడం, అగ్రో ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా వారి అవుట్‌ పుట్‌ కుమరింత విలువను అందించేలా చే యడం చేస్తామని తెలిపారు