- శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని వెల్లడి
ఆసిఫాబాద్, వెలుగు: బాలికలు, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ ప్రధాన ధ్యేయమని ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ నితికా పంత్ అన్నారు. శనివారం ఎస్పీ ఆఫీస్లో నితికా పంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ , అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత, మతపరమైన దూషణలు చేయడం, తప్పుడు ప్రచారం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
