సొంత స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకున్న ఆర్ట్ డైరక్టర్‌

సొంత స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకున్న ఆర్ట్ డైరక్టర్‌

ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరక్టర్‌ నితిన్ దేశాయ్ ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ రాయ్‌గఢ్‌లోని అతని ఎన్‌డీ స్టూడియోలో అయన ఉరేసుకున్నారు. అయితే నితిన్ మరణానికి గల కారణాల గురించి పోలీసులు ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నితిన్ దేశాయ్ పూర్తిపేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్. ఆయన ఆర్ట్ డైరక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్ గా అనేక టెలివిజన్ కార్యక్రమాలు కూడా చేశారు. 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య.. బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. కాగా ఆయన లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్‌ దే చుకే సనమ్ వంటి హిట్ మూవీస్‌ కు ఆయన ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.

అంతేకాదు నితిన్ దేశాయ్ ప్రొడ్యూసర్‌గా మారి చంద్రకాంత్ ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆ బ్యానర్‌ లోనే ఓల దేశ్‌ దేవీ అనే భక్తి చిత్రాన్ని నిర్మించారు. బెస్ట్ ఆర్ట్ డైరక్టర్‌గా నాలుగుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నితిన్ దేశాయ్.. 52 ఎకరాల్లో ఎన్‌డీ స్డూడియోస్‌ ను ఏర్పాటు చేశారు. అందులోనే ఈ రోజు ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిగ్‌ బాస్‌ హిందీ ప్రొగ్రాంకు కూడా నితిత్ దేశాయ్‌ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.