కాంగ్రెస్ చేసిన తప్పులను మనం చేయొద్దు: నితిన్ గడ్కరీ

కాంగ్రెస్ చేసిన తప్పులను మనం చేయొద్దు: నితిన్ గడ్కరీ

గోవా: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను బీజేపీ చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ భిన్నా భిప్రాయాలు కలిగి ఉన్నందునే ప్రజలు పదేపదే ఎన్నుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన పనాజీలో జరిగిన గోవా బీజేపీ కార్యవర్గ సమావేశంలో  పాల్గొని, మాట్లాడారు. ‘‘బీజేపీ మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని నా గురువు అద్వానీ చెప్పేవారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల కారణంగానే కాంగ్రెస్ గతంలో ఓడిపోయింది.

 బీజేపీ అలాంటి తప్పిదాలకు దూరంగా ఉండాలి. మనం కూడా కాంగ్రెస్ చేసిన తప్పులే చేస్తే ఇక అధికారం లోకి వచ్చి ఏం ప్రయోజనం” అని గడ్కరీ ప్రశ్నించారు. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చే సాధనంగా రాజకీయా లను గుర్తించాలన్నారు. అవినీతి రహిత దేశాన్ని సృష్టించాలని, అందుకు ప్రణాళికలు రూపొందించు కోవాలని కోరారు. తన సొంత రాష్ట్రం (మహారాష్ట్ర)లో కుల సంబంధిత రాజకీయాలకు చోటులేదన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  అధికారాన్ని నిలబెట్టుకునేలా ప్రతి నియోజక వర్గాన్ని సందర్శించాలని కోరారు.