త్వరలో శాటిలైట్ ఆధారంగా జీపీఎస్ టోల్ చెల్లింపులు: నితిన్ గడ్కరీ

త్వరలో శాటిలైట్ ఆధారంగా జీపీఎస్ టోల్ చెల్లింపులు: నితిన్ గడ్కరీ

ఇండియాలో  ఇప్పటి  వరకు ఉన్న టోల్ చెల్లింపుల విధానానికి స్వస్తి చెప్పనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ  మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన శాటిలైట్ జీపీఎస్ తో టోల్ చెల్లింపుల గురించి మాట్లాడారు. హైవేలపై ప్రయాణించే కి.మీ దూరాన్ని బట్టి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా కట్ అయ్యే సిస్టమ్ తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ సిస్టిమ్‌లో టోల్ రీచార్జి చేసుకున్న  వాహనదారులు ప్రయాణించిన దూరం ఆధారంగా బ్యాలెన్స్ కట్ అవుతాయని వివరించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(GPS) ఆధారిత టోల్ చెల్లింపుల సాంకేతికలో సాధ్యాసాధ్యాలు నిపుణులతో పరిశీలిసున్నామన్నారు. 


 ప్రయాణికుల టైం వేస్ట్ కాకుండా.. ఈ జీపీఎస్ టోల్ విధానం బాగుంటుందని గట్కారీ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ ను పబ్లిక్, ప్రైవేట్ బాగస్వామ్యంతో రూపొందిస్తున్నారు. ఫాస్ట్ టాగ్ టోల్ అకౌంట్ కు లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ గా నేషనల్ హైవేలపై వారు ప్రయాణించిన దూరాన్ని బట్టి చెల్లింపులు జరిగిపోతాయని స్పష్టం చేశారు. దీని వల్ల వాహనదారులకు టైం, డీజిల్ రెండూ సేవ్ అవుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి తెలియజేశారు.