బార్డర్ నుంచి బాలీవుడ్ దాకా

బార్డర్ నుంచి బాలీవుడ్ దాకా
  • గాయం వల్ల ఆర్మీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్
  • 48 ఏళ్ల వయసులో ఫ్యాషన్ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్
  • ఫ్యాషన్ కింగ్ గా మారిన ఆర్మీ మాజీ అధికారి
  • సక్సెస్ కు ఏజ్ ఫ్యాక్టర్ అడ్డుకాదని నిరూపిస్తున్న వైనం
  • సినిమాల్లోనూ బిజీ బిజీ

నితిన్ మెహతా. ఇండియన్ ఆర్మీ మాజీ ఆఫీసర్. 21 ఏళ్లపాటు దేశ రక్షన కోసం నిరంతరం గస్తీ కాశాడు. విధి నిర్వహణలో ఏ ఒక్కరోజు వెనుకడుగేసింది లేదు. కానీ.. గాయం కారణంగా ఆర్మీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 48 ఏళ్ల వయసులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. వెనుకడుగు వేయాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు. సినిమా రంగంలో ప్రవేశించి మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ బాధపడుతున్న ఎంతోమందికి నితిన్ మెహతా ప్రేరణగా నిలుస్తున్నాడు.

ఫ్యాషన్ రంగంలోకి ఎంట్రీ..
గాయం కారణంగా నితిన్ మెహతా  ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్ట్ లో ఓ ఫిలిం మేకర్ నితిన్ మెహతాను చూశాడు. శారీరకంగా ఎంతో ధృఢంగా ఉండే నితిన్ మెహతాను చూసిన ఆ ఫిలిం మేకర్... మెహతాకు ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నితిన్ మెహతా అక్కడి నుంచి వెనుదిరిగాడు. కానీ ఈ క్రమంలోనే అతడు ఫ్యాషన్ రంగం వైపు అట్రాక్ట్ అయ్యాడు. ఎలాగైనా మోడల్ గా మారాలనుకున్నాడు. అదే విషయాన్ని కుటుంబ సభ్యలుకు చెబితే.. ఈ వయసులో ఇన్ని రిస్క్స్ అవసరమా ? అన్నారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెఫుల్ మోడల్ గా రాణిస్తున్నాడు. అలాగే సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారాడు. ఈ మధ్య రిలీజైన తెలుగు సినిమా ‘అఖండ’లో ఆయన పోషించిన విలన్ క్యారెక్టర్ కు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, దీపికా పడుకొనె జోడీగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. కాగా.. ఫిట్నెస్, మంచి శరీరాకృతి, అన్నింటికి మించి ఆత్మ విశ్వాసం... తన విజయానికి సీక్రెట్స్ అని ఈ స్టార్ మోడల్ చెబుతున్నాడు.  

మరిన్ని వార్తల కోసం..

పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు

ప్రధాని మోడీకి శ్రీలంక క్రికెటర్ థ్యాంక్స్