ఆ సెలవులు రద్దు... బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

 ఆ సెలవులు రద్దు... బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్కూల్ హాలీడేస్ పై బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ 2024 సెలవు జాబితాను విడుదల చేసింది. అయిుతే ఇందులో  జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి,  . శివరాత్రి, తీజ్, వసంత పంచమి, తీజ్, జీవితపుత్రిక  పండగల సెలవులను రద్దు చేసింది.  

అంతేకాకుండా మేడే, గాంధీ జయంతి రోజల్లో ఉన్న సెలవులను రద్దు చేసింది.  మరోవైపు రంజాన్, బక్రీద్ లకు చెరో మూడు రోజులు, మొహర్రానికి  రెండు రోజులు సెలవులు ప్రకటించింది.  అదే సమయంలో, గురుగోవింద్ సింగ్ జయంతి, రవిదాస్ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు.  

ఉపాధ్యాయులకు ఉన్న 60 రోజుల సెలవుల్లో 38 రోజులు పాఠశాలకు రావాల్సి ఉంటుందని, ఏడాదిలో 22 రోజులు మాత్రమే సెలవు ఉంటుందని తెలిపింది.  టీచర్లకు సమ్మర్ వెకేషన్ క్యాన్సిల్ చేసింది.   తాజా క్యాలెండర్‌పై నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.  హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నితీష్ కుమార్ పరిపాలన ఉందంటూ  బీజేపీ నేత సుశీల్ మోడీ ఆరోపించారు.

  ముస్లిం పండుగలకు సెలవులు ఇచ్చి..  హిందూ పండుగలకు సెలవులను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు.    ప్రజలే ఈ నేతలకు తగిన సమాధానం చెబుతారని విమర్శించారు.