బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్..

బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్..

బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. ఫిబ్రవరి12వ తేదీ సోమవారం అసెంబ్లీలో నితీష్ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కొంది.  నితీస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 129 ఓట్లు రావడంతో.. బలపరీక్షలో విజయం సాధించింది. దీంతో నితీష్ ప్రభుత్వం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. విశ్వాస పరీక్షలో నితీష్ సర్కార్ నెగ్గడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.  

 బీహార్ లో.. ఆర్ జెడీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమితో పొత్తు పెట్టుకుని నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడీయు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇటీవల నితీస్ కుమార్.. కూటమి నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఎన్డీఎ కూటమితో జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీస్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి.  అధికారం దక్కాలంటే ఇందులో మ్యాజిక్ ఫిగర్ 122 సాధించాల్సి ఉంటుంది. బలపరీక్షలో 129 మంది మద్దతు తెలుపడంతో నితీశ్‌ ప్రభుత్వం విజయం సాధించింది.అనంతరం నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.

Also Read : నాగార్జునసాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలి