అమ్మాయిలకు ఇంటర్ పాస్ ఐతే రూ.25 వేలు.. డిగ్రీ పాస్ ఐతే రూ.50 వేలు

అమ్మాయిలకు ఇంటర్ పాస్ ఐతే రూ.25 వేలు.. డిగ్రీ పాస్ ఐతే రూ.50 వేలు
  •     12వ క్లాస్ పాసయితే రూ. 25 వేల సాయం
  •     యూత్ కు టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ సెంటర్లు  

పాట్నా: బీహార్ లో మళ్లీ అధికారంలోకి వస్తే.. 12వ క్లాస్ పాస్ అయిన గర్ల్ స్టూడెంట్లకు రూ. 25 వేల చొప్పున, డిగ్రీ పాస్ అయిన అమ్మాయిలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు జేడీయూ ప్రెసిడెంట్,​ చీఫ్​మినిస్టర్ నితీశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, సెల్ఫ్​ రిలయన్స్ కోసం.. జేడీయూ రూపొందించిన ‘సాత్ నిశ్చయ్ పార్ట్ 2 (7 పాయింట్ల ప్లాన్ 2)’ను ఆయన ఆదివారం ప్రకటించారు.  రాష్ట్రంలో గత ఐదేళ్లలో 7 పాయింట్ల ప్లాన్ 1ను అమలు చేశారు. వీటికి అదనంగా వచ్చే ఐదేళ్లలో పార్ట్ 2 ప్లాన్ ను అమలు చేయనున్నట్లు నితీశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘ప్రజలకు సేవ చేయడం మా డ్యూటీ. బీహార్ కు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీ సహకారం, బ్లెస్సింగ్స్ తో 7 నిశ్చయ్ పార్ట్ 2ను కూడా అమలు చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపి, సెల్ఫ్ రిలయంట్ గా నిలబెడతామని ధీమాగా ఉన్నా..” అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, బీహార్ అసెంబ్లీలో 243 సీట్లున్నాయి. ఎన్ డీఏ కూటమిలోని జేడీయూ122, బీజేపీ 121 సీట్లు పంచుకున్నాయి. జేడీయూ తరఫున 115 మంది క్యాండిడేట్లను నితీశ్ ప్రకటించారు. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించారు. మరో 7 సీట్లను జీతన్ రామ్ మంఝీ ఆధ్వర్యంలోని హెచ్ఏఎం పార్టీకి కేటాయించారు. బీజేపీ తన సీట్లలోంచి 11 సీట్లను వీఐపీ పార్టీకి ఇచ్చింది. ఈ 4 పార్టీలు త్వరలో జాయింట్ మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి.

జేడీయూ హామీలు ఇవే.. 

  • యూత్ కు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ ప్రోత్సాహం
  • ఐటీఐ, పాలిటెక్నిక్ సంస్థల్లో ట్రెయినింగ్ క్వాలిటీ పెంచేందుకు ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
  • జిల్లాల వారీగా జాబ్ ఓరియెంటెడ్ ట్రెయినింగ్ ఇచ్చేందుకు మెగా స్కిల్ సెంటర్లు,ప్రతి డివిజన్ లో టూల్ రూంలు, ట్రెయినింగ్ సెంటర్లు
  • స్కిల్ డెవలప్ మెంట్, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ కోసం ప్రత్యేకంగా డిపార్ట్ మెంట్ ఏర్పాటు
  • మహిళల ఎంపవర్ మెంట్ కోసం.. 12వ క్లాస్ పాస్ అయిన గర్ల్ స్టూడెంట్లకు రూ. 25 వేలు, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన గర్ల్ స్టూడెంట్లకు రూ. 50 వేల ఆర్థిక సాయం
  • మహిళా ఎంట్రప్రెన్యూర్స్ కు ప్రాజెక్టు కాస్ట్ లో 50% గ్రాంట్, రూ. 5 లక్షల వరకూ వడ్డీ లేని లోన్లు
  • కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుకు 50%(గరిష్టంగా 3 లక్షలు), 7% గ్రాంట్లతో 7లక్షల దాకా లోన్లు
  •  లోకల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, జిల్లా ఆఫీసుల్లో రిజర్వేషన్ల ద్వారా మహిళల భాగస్వామ్యం పెంపు

వీటితో పాటు.. రైతులకు సాగునీరు, ప్రతి ఊళ్లో సోలార్ స్ట్రీట్ లైట్లు, సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లు, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు, టాయిలెట్లు, రోడ్ల నిర్మాణం, హెల్త్ కేర్ ఫెసిటీల అభివృద్ధి

బీజేపీ మరో లిస్టు 46 మంది క్యాండిడేట్ల ప్రకటన

న్యూఢిల్లీ: బీహార్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న క్యాండిడేట్ల లిస్టును బీజేపీ ఆదివారం రిలీజ్ చేసింది. మొత్తం 46 మంది పేర్లను ప్రకటించింది. వీరిలో ప్రస్తుత మినిస్టర్ నంద్ కిశోర్ యాదవ్, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కొడుకు నితీశ్ మిశ్రా ఉన్నారు. బీజేపీ ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో జేడీయూ, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం)లతో కలిసి పోటీ చేస్తోంది.

కాంగ్రెస్ కమిటీలు..కీలక కమిటీకి చైర్మన్​గా సూర్జేవాలా

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రె స్ పార్టీ ఆదివారం పలు కమిటీలను నియమించింది. 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఎలక్షన్ మేనేజ్ మెంట్, కోఆర్డినేషన్ కమిటీకి పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా చైర్మన్ గా నియమితులయ్యారు. మోహన్ ప్రకాశ్ కన్వీనర్​గా ఎంపికయ్యారు. ఈ ప్యానెల్​లో మీరా కుమార్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, కీర్తీ ఆజాద్, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్ వంటి సీనియర్ నేతలుఉన్నారు. ప్రచార కమి టీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, పబ్లిక్ మీటింగ్, లాజిస్టిక్స్ కమిటీ, లీగల్, ఆఫీస్ మేనేజ్ మెంట్ కమిటీలను కూడా సోనియా గాంధీ ఆమోదించారు. కాగా, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘గ్రాండ్ అలయెన్స్’గా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 70 సీట్లలో, ఇతర పార్టీలు మిగతా సీట్లలో క్యాండిడేట్లను బరిలో దింపనున్నాయి.