IND vs AUS: గాయాలతో కెరీర్ సతమతం.. తొలి మూడు టీ20లకు టీమిండియా ఆల్ రౌండర్ దూరం

IND vs AUS: గాయాలతో కెరీర్ సతమతం.. తొలి మూడు టీ20లకు టీమిండియా ఆల్ రౌండర్ దూరం

టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ తెలుగు ఆల్ రౌండర్ ను ఏదో ఒక గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి మూడు టీ20 మ్యాచ్ లకు నితీష్ అందుబాటులో ఉండడం లేదు. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న నితీష్ పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 లో స్థానం దక్కలేదు. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నట్లు బీసీసీఐ బుధవారం (అక్టోబర్ 29) కన్ఫర్మ్ చేసింది. 

గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేకు దూరం అయ్యాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో నితీష్ ఎడమ క్వాడ్రిసెప్స్‌కు గాయమైంది. తొడ కండరాలతో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న తొలి టీ20లో ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకుండానే ఆసీస్ పై ఆడనుంది. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్ లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ లో సమతుల్యత వస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన నితీష్.. ఇటీవలే జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో వచ్చాడు. దురదృష్టవశాత్తు  ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్ళీ గాయపడడం విచారకరం.     

►ALSO READ | Women's ODI World Cup 2025: సెమీ ఫైనల్ పోరు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. సౌతాఫ్రికా బ్యాటింగ్
  
ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లాడిన నితీష్ 90 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 74కాగా.. ఈ ఫార్మాట్‌లో మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ప్రస్తుతం 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. క్రీజ్ లో గిల్ (37), సూర్య కుమార్ యాదవ్ (39) ఉన్నారు. అభిషేక్ శర్మ (19) విఫలమయ్యాడు.