
మార్చి 13న ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో నితీష్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని ప్లేస్ లో నితీష్ రానా నియమించింది.
శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ముందుగా సునీల్ నరైన్ లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఎవరైనా ఒకరికి జట్టు బాధ్యతలు ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి నాయకత్వం వహించిన అనుభవం ఉన్న రాణాకే ఫ్రాంచైజీ మద్దతు ఇచ్చింది. అయితే ఐపీఎల్ 2023 సీజన్ లోని కొన్ని మ్యాచ్ లకు శ్రేయస్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపింది.
2018 నుండి నితీష్ రాణా కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్నాడు. నితీష్ రాణా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడి 27.96 సగటుతో 2181 పరుగులు చేశాడు. అతను అత్యధిక స్కోరు 87. 15 హాఫ్ సెంచరీలు చేశాడు.