ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జీవన్‌రెడ్డి మాల్ లోని లిఫ్ట్ సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో.. లిఫ్ట్ ఎక్కిన ఇద్దరు చిన్నారులు గంట పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. పేరెంట్స్ తో కలిసి షాపింగ్‌కు వచ్చిన ఇద్దరు చిన్నారులు లిఫ్ట్ ఎక్కారు. సరదా కోసం చిన్నారులు లిఫ్ట్ ఎక్కారు. కొద్ది సేపటికే లిఫ్ట్ ఆగిపోవడంతో తమ వద్ద ఉన్న ఫోన్‌తో పేరెంట్స్‌కు ఫోన్ చేసి లిఫ్ట్ లో ఉండిపోయామని సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే విషయాన్ని మాల్ నిర్వాహకులకు చెప్పారు. టెక్నీషియన్‌ను పిలిపించి కొద్ది సేపటికి లిఫ్ట్ డోర్ ఓపెన్చేయించి పిల్లలిద్దరినీ బయటకు తీసుకొచ్చారు. మాల్ నిర్వహకులతో చిన్నారుల పేరెంట్స్ వాదనకు దిగారు. నిర్వాహకులు సారీ చెప్పడంతో పేరెంట్స్ శాంతించారు.
