నిజామాబాద్, వెలుగు: టెన్త్ తర్వాత ఎంచుకునే మార్గం జీవితాన్ని స్థిరపరుస్తుందని, ఇందుకోసం క్లారిటీతో ఇష్టమైన కోర్సుల్లోనే చేరాలని నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా లోపాలు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టెన్త్లో టాపర్లుగా నిలిచిన గవర్నమెంట్స్టూడెంట్స్కు నగదు పురస్కారాలు, బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
నిర్మల్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు సర్కారు అన్ని వసతులు కల్పిస్తోందని, నిష్ణాతులైన టీచర్లతో విద్యాబోధన చేస్తోందని తెలిపారు.
