- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు: నగర కార్పొరేషన్ పరిధిలో మంజూరైన నిర్మాణాలను ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం నగర పాలక సంస్థలో ఇంజినీర్లతో కలిసి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో కలెక్టర్మాట్లాడారు. జోన్ల వారీగా చేపట్టాల్సిన సీసీ, బీటీ రోడ్ నిర్మాణాలు, ప్యాచ్ వర్క్ పనులు సమీక్షించారు.
అగ్రీమెంట్ ఖాతరు చేయని కంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. తరువాత మీటింగ్ నాటికి ప్రగతి కనబడాలని సూచించారు. అంతకు ముందు జక్రాన్‌పల్లి మండలం పడ్కల్ విలేజ్ జడ్పీ హైస్కూల్లో స్టూడెంట్స్ కోసం నిర్వహించిన స్పోర్ట్స్ పరిశీలించారు. మండలంలో సెకండ్ ఫేజ్ నామినేషన్స్ ప్రక్రియను చెక్ చేశారు.
