ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి : సీపీ సాయి చైతన్య

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి :  సీపీ సాయి చైతన్య
  • నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 

పోతంగల్, (కోటగిరి), వెలుగు : పోతంగల్ అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​లో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని మంజీరా నది వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర చెక్​పోస్ట్​ను తనిఖీ చేశారు. 

చెక్ పోస్ట్  సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పోతంగల్ చెక్​పోస్ట్​ద్వారా మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణలోకి  అక్రమ రవాణా చేసే వాహనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు.  సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్ ఉన్నారు.