
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్.. తీన్మార్ మల్లన్నపై విరుచుకు పడ్డారు. కేటీఆర్ కుటుంబం జోలికొస్తే మల్లన్నని మూడు ముక్కలుగా నరుకుతానంటూ తీవ్ర పద జాలంతో మండి పడ్డారు. జర్నలిస్టు ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మంత్రి అని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టా రాజ్యాంగ మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని ఈడ్చు కోచ్చి కొడతానని అన్నారు. ప్రభుత్వం వెంటనే తీన్మార మల్లన్నపై పీడీయాక్ట్ కేసు నమోదు చేయాలన్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ చిన్న పిల్లవాడని.. ఆయనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు..బిజెపి ఇదే సంస్కారం నేర్పిస్తుందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ జిల్లాకు ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగ దీక్ష చేయాలన్నారు.