నిజామాబాద్ జిల్లా.. సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్ సస్పెండ్..

నిజామాబాద్ జిల్లా.. సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్ సస్పెండ్..

నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లైలో అవినీతికి పాల్పడిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైస్ మిలర్లతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది.  కీలక అధికారుల సస్పెన్షన్ డిపార్ట్ మెంట్ లో కలకలం రేపింది. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకీల్  రైస్ మిల్లులకు నిబంధనలకు విరుద్ధంగా జిల్లా పౌర సరఫరా శాఖాధికారి చంద్రశేఖర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీష్ లు వడ్లను కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈ వ్యవహారంలో దాదాపు వంద కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారుల పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంది. అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు అధికారులు చంద్రశేఖర్, జగదీష్ లను సర్కార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మేడ్చల్ డీఎంగా ఉన్న రాజేందర్ కి నిజమాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించింది సర్కార్.