ఆ నేత ఎవరో కేటీఆర్‍ చెప్పాలి : రైతు ఐక్య వేదిక డిమాండ్​

ఆ నేత ఎవరో కేటీఆర్‍ చెప్పాలి :  రైతు ఐక్య  వేదిక డిమాండ్​

జగిత్యాల టౌన్‍, వెలుగు: 93 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల పేరుతో నామినేషన్లు వేశారని, ఒకరి ఇంట్లోనే ఆ నామినేషన్లు తయారు చేశారన్న కేటీఆర్, ఆ కాంగ్రెస్ నేత ఎవరో చెప్పా లని రైతు ఐక్య వేదిక సంఘ నాయకులు డిమాండ్​ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూళ్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఏసీ కార్లలో తిరిగితే రైతుల కష్టాలు తెలియవన్నారు. రైతు సమస్యలపై శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే అక్రమంగా 16 క్రిమినల్‍ కేసులు నమోదు చేశారని పేర్కొన్నా రు. దీనికి నిరసనగానే రైతు ఐక్య వేదిక సంఘం ఆధ్వర్యంలో రైతులంతా కలిసి పార్లమెంట్‍ బరిలో నిలబడ్డామన్నారు.

రైతులతో ఏ నాయకుడు నామినేషన్లు వేయించలేదని, రైతులతో చెలగాటమాడినందుకే ఎంపీ స్థానం కోల్పోయారని గుర్తు చేశారు. అయినా రైతులను కించపరిచేలా టీఆర్‍ఎస్‍ నాయకులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతుల గోడు పట్టించుకోవాలని, పసుపు బోర్డు ఆరు నెలల్లో ఏర్పా టు చేయాలని అన్నారు.

ఈసారి ఒక్కరినే నిలబెడతాం

నిజామాబాద్‍ పార్లమెంట్‍ పరిధిలో ఉన్న టీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలు రైతుల పట్ల విషం చిమ్ముతున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కవిత కోసం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన స్థానాన్ని త్యాగం చేస్తానని అన్నారని, ఆ స్థానంలో రైతుల తరఫున ఈసారి ఒక్కరినే బరిలో ఉంచి పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, ఏలిటి లక్ష్మారెడ్డి, తిరుపతి, వెంకటేష్‍, రఘుపతి, మోహన్‍, గోపాల్‍, వామన్‍, ఎండీ జమీల్‍ పాల్గొన్నారు.