
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. నాలుగు రోజులుగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు ఫుల్కెపాసిటీకి చేరుకుంది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు శ్రీశైలం నాలుగు గేట్లను పది మీటర్ల ఎత్తువరకు ఓపెన్ చేసి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని వదులుతున్నారు.