నల్గొండ పట్టణంలో హాట్ కేక్ల్లా అమ్ముడైన హోసింగ్ బోర్డు ప్లాట్లు .. చదరపు గజం రూ.28,500కు కొనుగోలు

నల్గొండ పట్టణంలో హాట్ కేక్ల్లా అమ్ముడైన హోసింగ్ బోర్డు ప్లాట్లు .. చదరపు గజం రూ.28,500కు కొనుగోలు

నల్గొండ అర్బన్, వెలుగు : పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని హెచ్ఐజీ, ఎంఐజీ ప్లాట్లు హాట్ కేక్​ల్లా అమ్ముడయ్యాయి. మంగళవారం నల్గొండలో నిర్వహించిన వేలం పాటలో 21 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.8,97,48,600 ఆదాయం వచ్చింది. వీటిలో పలు ప్లాట్లను నిర్ణయించిన ఆప్​ సెట్ ధర కంటే దాదాపు రెట్టింపు ధరతో వేలం లో కొనుగోలు చేశారు. హెచ్ఐజీ, ఎంఐజీకి చెందిన 27 ప్లాట్ల విక్రయానికి హౌజింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో  భాగంగా నిర్వహించిన వేలంలో అధిక సంఖ్యలో కొనుగోలుదారులు పాల్గొన్నారు. 

చదరపు గజానికి హెచ్ఐజీ ప్లాట్ కు రూ.15 వేలు, ఎంఐజీ స్థలానికి రూ.13 వేలుగా ఆప్​సెట్ ధర నిర్ధారించారు. హెచ్ఐజీ ప్లాట్ ను గరిష్టంగా రూ.28,500 ధరకు కొనుగోలు చేశారు. మరో రెండు హెచ్ఐజీ ప్లాట్లను కూడా నిర్ధేశిత ఆఫ్ సెట్ ధర కంటే అధికంగా రూ.25,500, రూ.24,000లకు కొనుగోలు చేశారు. ఎంఐజీ ప్లాట్ల విషయంలో 220 చదరపు గజాల ప్లాట్ గరిష్టంగా 23,500 వరకు ధర పలికింది. అన్ని ప్లాట్లకు కూడా కనీస ధర కంటే అధికంగానే చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. ఇలా మొత్తం కాలనీలో 4,660 చదరపు గజాల విస్తీర్ణంలోని వివిధ రకాల ప్లాట్లను విక్రయించగా, సగటున ఒక్కో చదరపు గజం స్థలానికి రూ.19,069 ధర పలికింది.